Purandheswari: విచారణచేసే అర్హత పవన్ కి ఉంది..! 22 d ago
బియ్యం అక్రమ రవాణాపై పవన్ చొరవ సంతోషకరమని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్కి ఎక్కడికైనా వెళ్లి విచారణచేసే అర్హత ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కూడా పీడీఎస్ రైస్ గురించి మాట్లాడామని గుర్తు చేశారు. అంతర్జాతీయ పీడీఎస్ మాఫియాగా పవన్ మాటల్లో తప్పు లేదని చెప్పారు. అలాగే జగన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, అదానీతో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.